కేసీఆర్ టక్కు టమారా విద్యలు ఇక చెల్లవ్

కేసీఆర్ టక్కు టమారా విద్యలు ఇక చెల్లవ్

కరీంనగర్ : హుజూరాబాద్ లో ఎగిరేది కాషాయ జెండా మాత్రమే అన్నారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. యావత్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపేలా హుజూరాబాద్ ప్రజలు తీర్పునియ్యాలన్నారు. 18 ఏళ్లుగా హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నానని చెప్పారు. TRS వాళ్లు పంచే డబ్బు సంచులకు ఆశలకు ఇక్కడి ప్రజలు లొంగరన్నారు. హుజురాబాద్ ఎన్నికే లేకపోతే కేసీఆర్ ఫాంహౌస్ దాటి వచ్చేవాడా అని ప్రశ్నించారు. మీ టక్కు టమారా విద్యలు ఇక చెల్లవని.. తెలంగాణ ప్రజలు మీ మాటలపై విశ్వాసం కోల్పోయారని చెప్పారు.  

దళితుడిని సీఎం చేస్తానని, లేకుంటే తల నరక్కుంటానన్న కేసీఆర్.. ఆ పదవి ఇవ్వకపోగా.. ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి తొలగించారన్నారు. దళితలకు పాలించే నైపుణ్యం, తెలివి లేదని అవమాన పరిచారని.. రాష్ట్రంలో 16 శాతం ఎస్సీలుంటే.. కెేబినెట్ లో ఆ వర్గం వాళ్లు  ఎందరు మంత్రులున్నారన్నారు. వాళ్ల బాధలు, వాళ్లకే తెలుస్తాయని మంత్రివర్గంలో వాళ్లకు ప్రాధాన్యత ఉండాలని చెప్పేవారు కేసీఆర్ అన్నారు. గతంలో మాదిగ సామాజిక వర్గం నుంచి ఒకరుంటే, ఇప్పుడు మాల సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఇచ్చారన్నారు.  చెరో మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన కూడా ఆయనకు లేకుండా అవమానించారని.. ఎన్నడూ లేనిది సీఎం దళితలపై ఎనలేని ప్రేమ ఒలకబోస్తున్నారన్న  విమర్శలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా సీఎం కార్యాలయమే కేంద్ర బిందువు అన్నారు. అలాంటి  సీఎంవో ఆఫీసులో దళిత, గిరిజన, బీసీ ఐఎఎస్ అధికారులకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. ఈ జాతులకు తెలివి లేదనే.. అక్కడ అవకాశం ఇవ్వకుండా అవమానించారన్నారు ఈటల రాజేందర్.