
హుజూరాబాద్, వెలుగు: హుజూరాబాద్ బీజేపీ క్యాండిడేట్ఈటల రాజేందర్ సోమవారం ప్రచారం చేస్తున్న టైమ్లో ఓ ఇంట్రస్టింగ్ సీన్ కనిపించింది. హుజూరాబాద్ మెయిన్ రోడ్డు మీదుగా ప్రజలకు అభివాదం చేస్తూ ఈటల వెళ్తూ ఉన్నారు. అదే టైమ్లో టీఆర్ఎస్ నిర్వహించిన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనానికి వెళ్లి వస్తున్న వాళ్ల బస్సు ఎదురైంది. ఈటలను చూడగానే బస్సులోని వాళ్లు ఆయనకు దండం పెడుతూ, విక్టరీ సింబల్ చూపిస్తూ కనిపించారు. అంతకుముందు జరిగిన మున్నూరుకాపు సభలో మంత్రి హారీశ్ రావు మాట్లాడుతూ.. తాను మాత్రం బాగుంటే చాలని ఈటల అనుకుంటున్నారని.. రైతులు, ప్రజలు ఏమైనా ఆయనకు బాధ లేదని విమర్శించారు. మున్నూరుకాపుల వ్యతిరేకి ఈటలను చిత్తుగా ఓడించాలని మరో మంత్రి కమలాకర్ అన్నారు.