లాక్ డౌన్, కర్ఫ్యూలకు అవకాశమే లేదు

V6 Velugu Posted on Apr 07, 2021

రాష్ట్రంలో లాక్ డౌన్,  కర్ఫ్యూ లకు అవకాశం లేదన్నారు మంత్రి ఈటెల రాజేందర్. .  ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్ని వసతులు ఉన్నాయన్నారు. కరోనాపై అధికారులతో రివ్యూ చేసిన ఈటెల.. ప్రైవేట్ హాస్పిటల్స్ కరోనాను వ్యాపార కోణంలో చూడొద్దన్నారు. అనవసరంగా డబ్బులు చార్జ్ చేయొద్దని చెప్పామన్నారు. అన్ని హాస్పిటల్స్ లో కరోనా సేవలు కొనసాగుతాయన్నారు. వైద్య సిబ్బంది 24 గంటలు సేవలు అందిస్తున్నారన్నారు.33 జిల్లాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.ఎక్కడి రోగులకు ఆ జిల్లాల్లోని చికిత్స  అందిస్తారన్నారు. ర్యాపిడ్ టెస్టులతో వెంటనే రిజల్ట్ వస్తుందన్నారు. టెస్టుల సంఖ్య లక్ష వరకు పెంచాలని భావిస్తున్నామన్నారు. హైదరాబాద్ లో  కేసులు పెరుగుతున్నాయన్నారు. పాజిటివ్ కేసులలో 90 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదన్నారు. ట్రేసింగ్ ఎక్కువ ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ త్వరగా అందుతున్న నేపథ్యంలో మరణాలు తక్కువగా ఉంటున్నాయన్నారు. 1.5 లక్షల మందికి ఒక్క రోజులో వ్యాక్సిన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పాజిటివ్ వచ్చిన వారికి దగ్గర్లోని పిహెచ్ సి వైద్యులు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి తెలుసుకుంటారన్నారు. 

Tagged Telangana, lockdown, corona

More News