హరీశ్ రావు చరిత్ర బయటపెడతా

V6 Velugu Posted on Sep 02, 2021

హుజురాబాద్ బై పోల్ క్రమంలో ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి హరీశ్ రావు తనపై చేసిన వ్యాఖ్యలకు ఈటల రాజేందర్  కౌంటరిచ్చారు. మంత్రి హరీశ్ రావుకు మతి భ్రమించిందని ఆయన చెప్పారు. హరీశ్ రావు చరిత్ర బయటపెడతానని ఆయన హెచ్చరించారు. తన మీద చేసిన ఆరోపణలపై చర్చకు తాను సిద్ధమని.. చర్చించేందుకు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరకు రావాలని సవాల్ విసిరారు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు తానే చేస్తానని చెప్పారు. హరీశ్ రావు ఓ తోపు అని అనుకుంటున్నారా? అని ఈటల ప్రశ్నించారు. హరీశ్ రావు నిర్వాకంపై ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. హుజురాబాద్‌లో హరీశ్ నడిచే రోడ్లు ఎవరు వేశారని ఆయన నిలదీశారు. హరీశ్‌ రావు సీఎం సీటుకే ఎసరు పెట్టాడని ఈటల ఆరోపించారు.

Tagged etela rajender, Harish Rao, reveal history

Latest Videos

Subscribe Now

More News