ఎటర్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదాయం రూ.7,167 కోట్లు.. జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ పెరుగుదల

ఎటర్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదాయం రూ.7,167 కోట్లు.. జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భారీ పెరుగుదల

న్యూఢిల్లీ: ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ కంపెనీ ఎటర్నల్ ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (క్యూ1) లో రూ.25 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.253 కోట్ల లాభంతో పోలిస్తే ఇది బాగా తక్కువ. ఈ ఏడాది మార్చిలో కంపెనీ జొమాటో నుంచి ఎటర్నల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బ్రాండ్ మార్చుకుంది. 

ఈ కంపెనీకి క్యూ1లో రూ.7,167 కోట్ల ఆదాయం రాగా, గతేడాది ఈ నెంబర్ రూ.4,206 కోట్లుగా ఉంది. అయితే ఆదాయం భారీగా పెరిగినా, ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగాయి. ఎటర్నల్ ఖర్చులు క్యూ1లో రూ.7,433 కోట్లకు చేరుకున్నాయి. గతేడాది జూన్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇవి రూ.4,203 కోట్లుగా ఉన్నాయి.  బ్లింకిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదాయం పెరిగిందని కంపెనీ పేర్కొంది.

ఎటర్నల్ నుంచి బ్లింకిట్ ఫుడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
బ్లింకిట్ ఫుడ్స్ అనే కొత్త సబ్సిడరీని స్థాపించినట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎటర్నల్ తెలిపింది. ఇది ఫుడ్ సర్వీసెస్ (తయారీ, సోర్సింగ్, సేల్,  డెలివరీ)లో  పనిచేస్తుందని వెల్లడించింది. క్విక్ కామర్స్ వ్యాపారాన్ని బలోపేతం చేయడానికి , వృద్ధి సాధించడానికి ఈ మార్పులు చేశామని వెల్లడించింది.