భూమిక కీలకపాత్రలో గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘యుఫోరియా’. నీలిమ గుణ నిర్మిస్తున్నారు. విఘ్నేశ్ గవిరెడ్డి హీరోగా పరిచయం అవుతున్నాడు. డిసెంబర్ 25న సినిమా విడుదల కావలసి ఉండగా సోమవారం కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఫిబ్రవరి 6 న విడుదల చేయనున్నట్టు చెప్పారు.
నేటి సమాజాన్ని ప్రతిబింబిస్తూ ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు గుణశేఖర్ అన్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, సారా అర్జున్, నాజర్, రోహిత్, లిఖిత యలమంచలి, పృథ్వీరాజ్ అడ్డాల, కల్పలత, సాయి శ్రీనిక రెడ్డి ఇతర పాత్రలు పోషిస్తున్నారు. కాలభైరవ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
