న్యూఢిల్లీ: ఎముకల వ్యాధి చికిత్సలో వాడే తమ కొత్త బయోసిమిలర్ ఏవీటీ03కు యూరోపియన్ కమిషన్ మార్కెటింగ్ అనుమతి ఇచ్చిందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ప్రకటించింది.
ఇది ప్రోలియా (డెనోసుమబ్), ఎక్స్‌జేవా (డెనోసుమబ్)కు బయోసిమిలర్. ప్రోలియా డ్రగ్‌ను మెనోపాజ్ తర్వాత మహిళల్లో, అలాగే ఎముకలు విరిగే ప్రమాదం ఉన్న పురుషుల్లో ఆస్టియోపోరోసిస్ చికిత్సకు ఉపయోగిస్తారు. ఎక్స్‌జేవా అడ్వాన్స్డ్ క్యాన్సర్ వల్ల ఎముక సమస్యలు ఎదుర్కొనే పెద్దవారి చికిత్సలో వాడతారు.
