
- 443 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ సప్లయ్‌ను ఆపేసిన రష్యా..
- నష్టాల్లో యూరప్ మార్కెట్‌లు
ముంబై : బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సోమవారం లాభాల్లో క్లోజయ్యాయి. మెటల్స్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో ఇండెక్స్‌లు తిరిగి కీలక లెవెల్స్‌ను క్రాస్ చేయగలిగాయి. సెన్సెక్స్ సోమవారం 443 పాయింట్లు (0.75శాతం) పెరిగి 59,246 వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 126 పాయింట్లు ఎగిసి 17,666 వద్ద ముగిసింది. ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లయిన రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, ఐటీసీ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో పాటు, డాలర్ మారకంలో రూపాయి విలువ పెరగడంతో మార్కెట్‌లో సెంటిమెంట్ బలపడింది. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ సోమవారం 0.89 శాతం పెరగగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.46 శాతం లాభపడింది. సెక్టార్ల పరంగా చూస్తే మెటల్, క్యాపిటల్ గూడ్స్, టెలికం, బేసిక్ మెటీరియల్స్, బ్యాంక్, రియల్టీ, ఫైనాన్స్ ఇండెక్స్‌లు ఎక్కువ లాభపడ్డాయి. ‘ గ్లోబల్ అంశాలు ప్రతికూలంగా ఉన్నా బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ బుల్లిష్‌గా ట్రేడవ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఒపెక్ సమావేశానికి ముందు ఆయిల్ రేటు పెరిగింది. ముఖ్యంగా
యూఎస్ డాలర్ ఇండెక్స్ కొన్ని
దశాబ్దాల గరిష్టమైన 110 లెవెల్‌ను టచ్ చేసింది. ఈ నెలలో జరిగే పాలసీ మీటింగ్‌లో వడ్డీ రేట్లను ఫెడ్ కేవలం 0.50 శాతం మాత్రమే పెంచుతుందని దలాల్ స్ట్రీట్ భావిస్తోంది. నిఫ్టీకి మంగళవారం సెషన్‌లో 17,757 లెవెల్ మేజర్ రెసిస్టెన్స్‌గా పనిచేస్తోంది’ అని మెహతా ఈక్విటీస్ ఎనలిస్ట్ ప్రశాంత్ తాప్సీ అన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం 8 పైసలు పెరిగి 79.79 వద్ద సెటిలయ్యింది.