హైదరాబాద్ సిటీ, వెలుగు: మరో అంతర్జాతీయ సినిమా సంబురానికి హైదరాబాద్ సిటీ వేదిక కానున్నది. వరల్డ్‌వైడ్ సినిమాలకు వేదికగా మారుతున్న హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక యూరోపియన్ యూనియన్ ఫిల్మ్ ఫెస్టివల్ డిసెంబర్ 5 నుంచి 14 వరకు జరుగనున్నది. డచ్ దర్శకుడు జెల్లె డె జోంగ్ రూపొందించిన ‘మెమరీ లేన్’ చిత్రంతో ఫెస్టివల్ ప్రారంభమవుతుంది.
23 యూరోపియన్ దేశాల నుంచి ఎంపికైన 23 ఉత్తమమైన చిత్రాలు ఈ ఫెస్టివల్లో స్క్రీనింగ్ అవుతాయి. బెల్జియం నుంచి ‘జూలీ కీప్స్ క్వైట్’, ఆస్ట్రియా నుంచి ‘హ్యాపీ’, ఫ్రాన్స్ నుంచి ‘హెలీ’, జర్మనీ నుంచి ‘డైయింగ్’, డెన్మార్క్ నుంచి ‘మ్యాటర్స్ ఆఫ్ ది హార్ట్’, రొమేనియా నుంచి ‘త్రీ కిలోమీటర్స్ టు ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్’, ఇటలీ నుంచి ‘ఫమీలియా’ తదితర చిత్రాలు ఎంపికయ్యాయి.
ప్రసాద్ ల్యాబ్ ప్రివ్యూ థియేటర్, శ్రీ సారథి స్టూడియోస్, అలయన్స్ ఫ్రాన్సెస్ హైదరాబాద్ లో ఈ సినిమాలు స్క్రీనింగ్ అవుతాయి. అన్ని మూవీస్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఉంటాయి. ముందస్తు రిజిస్ట్రేషన్ లేదా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ పద్ధతిలో అందరికీ ఫ్రీ ఎంట్రీ ఉండనున్నది. వివరాలకు euffindia.com లో సంప్రదించవచ్చు.
