కాజీపేట, వెలుగు: వరంగల్ నిట్‌లో సోమవారం ‘ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ప్రాక్టికల్ డిమోనిస్ట్రేషన్ అండ్ ఎక్స్‌పో–2026’ నిర్వహించారు. సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ(సీఆర్ఐఎఫ్), హయోకీ ఇండియా సహకారంతో వాస్టెక్ టెక్నాలజీస్ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం జరిగింది.
హయోకీ నిపుణులు ఈవీ పవర్ యూనిట్ల పని తీరు, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, థర్మల్ మేనేజ్‌మెంట్, ఓవర్ ఓల్టేజీ, ఓవర్ చార్జ్ రక్షణ, స్టేట్ ఆఫ్ చార్జ్, డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ బిద్యాదర్ సుబుధి, సీఆర్ఐఎఫ్ హెచ్‌వోడీ ప్రొఫెసర్ ఎ.వీరేశ్ బాబు, ప్రొఫెసర్ ఉదయ భాస్కర్, వి.సుధాకర్, డి.రవికుమార్, జీఎస్ఆర్ సంజీవిని, హయోకీ ప్రతినిధులు రాజ్ సాన్, గోల్డెన్ సాన్ పాల్గొన్నారు.
