సికింద్రాబాద్ లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

సికింద్రాబాద్ లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు

ఉపయోగించని, ఖాళీ స్థలాల నుండి ఆదాయాన్ని పొందేందుకు దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో కొత్త ఈవీ(ఎలక్ట్రిక్ వెహికల్) ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేస్తోంది. కాచీగూడ, నాంపల్లి రైల్వే్స్టేషన్లతో పాటు ఇప్పుడు ఎంఎంటీఎస్ స్టేషన్లలోని ఖాళీ స్థలాల్లో కూడా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం మరో నెలరోజుల్లో కొత్త కాంట్రాక్టర్లను నియమించి పనులు ప్రారంభించాలని అధికారులు చూస్తున్నారు. అయితే, ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ రైల్వేస్టేషన్ లోని ఈవీ స్టేషన్ ద్వారా ప్రతిరోజు సగటున 25 ఎలక్ట్రానిక్ వాహనాలు ఛార్జ్ చేయబడతాయి. 

ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో లింగంపల్లి, హైటెక్ సిటీ, నెక్లెస్ రోడ్ (పీవీఎన్ ఆర్ మార్గ్), సంజీవయ్య పార్క్, లక్డీకా-పుల్, ఘట్‌కేసర్‌లోని ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్‌లలో 2023 కల్లా ఈవీ స్టేషన్‌లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటితో పాటు నగర శివార్లలోని ఖాళీ భూముల్లో కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ప్రారంభించాలని సౌత్ సెంట్రల్ రైల్వేస్ చూస్తోంది. ఇందులో భాగంగా మౌలా అలీ, మేడ్చల్, తెల్లాపూర్, ఉమ్దానగర్, ఫలక్‌నుమా రైల్వే స్టేషన్లలో ఖాళీగా ఉన్న రైల్వే భూములనుఈవీ ఛార్జ్ పాయింట్లకోసం ఉపయోగించనున్నారు.