Premisthunna: లవ్‌స్టోరీతో చైల్డ్ ఆర్టిస్ట్‌‌‌‌ సాత్విక్ వర్మ.. ‘ప్రేమిస్తున్నా’ సెకండ్ సింగిల్ రిలీజ్

Premisthunna: లవ్‌స్టోరీతో చైల్డ్ ఆర్టిస్ట్‌‌‌‌ సాత్విక్ వర్మ.. ‘ప్రేమిస్తున్నా’ సెకండ్ సింగిల్ రిలీజ్

సాత్విక్ వర్మ, ప్రీతి నేహా జంటగా భాను దర్శకత్వంలో కనకదుర్గారావు పప్పుల నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమిస్తున్నా’.గురువారం ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను విజయ్ సేతుపతి రిలీజ్ చేసి టీమ్‌‌‌‌‌‌‌‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.

సిద్ధార్థ్ సాలూర్ కంపోజ్ చేసిన పాటకు పూర్ణాచారి లిరిక్స్ అందించగా, శాండిల్య పీసపాటి, తన్వి మంజుల ఘంటసాల, ప్రదాన్య జలిగమ, శ్రేయషి పెండ్యాల కలిసి పాడారు.‘ఓ పిల్లా పిల్ల.. కల్లోలం ఏదో మొదలే.. గుండెల్లో ఇలా నువ్ చేరాకే.. ఎవరే నువ్వు.. ఎవరే నువ్వు.. ఎదలో చొరబడి పోయావు.. ఎదుటే ఉంటూ మాయే చేస్తున్నావూ..’ అంటూ సాగిన పాటలో హీరోహీరోయిన్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంది.

ఇదొక మ్యూజికల్ లవ్‌‌‌‌‌‌‌‌ స్టోరీ అని, అందరికీ నచ్చేలా ఉంటుందని ఈ సందర్భంగా దర్శకుడు భాను చెప్పాడు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని నిర్మాత అన్నారు. ఇప్పటికే ‘అరెరె’ అనే ఫస్ట్ సాంగ్‌‌‌‌ శ్రోతలను అలరిస్తుంది.