టీచర్ ను వేధిస్తున్న ఈవ్​టీజర్​​ అరెస్ట్

టీచర్ ను వేధిస్తున్న ఈవ్​టీజర్​​ అరెస్ట్

రాజేంద్రనగర్, వెలుగు: రాజేంద్రనగర్ మండలంలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్ గా విధులు నిర్వహిస్తూన్న మహిళను ఓ యువకుడు వేధిస్తున్నాడు. కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తుండడంతో తన భర్తకు విషయం తెలిపింది. దీంతో అతడిని పట్టుకునేందుకు వారం రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే బుధవారం పోలీసులతో సహాయంతో ప్లాన్ ప్రకారం స్కూల్​ వద్ద కాపుకాశారు. సదరు మహిళ రోజు మాదిరిగానే స్కూల్​కు వెళ్తుండగా యువకుడు వేధించసాగాడు. ఈ విషయాన్ని భర్తకు ఫోన్ ద్వారా తెలుపడంతో అతడు వచ్చి యువకుడిని పట్టుకుని రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు ఈవ్​టీచర్​ను అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్ పోలీసులు విచారిస్తున్నారు.