బీసీ ప్రధాని ఉన్నా న్యాయం జరుగుతలేదు : ఆర్ కృష్ణయ్య

బీసీ ప్రధాని ఉన్నా న్యాయం జరుగుతలేదు : ఆర్ కృష్ణయ్య

బీసీ ప్రధాని ఉన్నా దేశంలో తమకు న్యాయం జరగడంలేదని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వాపోయారు. బీసీల డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 8 , 9 తేదీలలో ఛలో ఢిల్లీ చేపడుతున్నట్లు చెప్పారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు 56 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పార్లమెంట్ భవనాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అగ్రకులాల వారు ఎలాంటి ధర్నాలు, డిమాండ్లు చేయకున్నా 10 శాతం రిజర్వేషన్లు కల్పించారని కృష్ణయ్య ఆరోపించారు. 

బీసీలను పాలకులు ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారని ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. బీసీలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. రిజర్వేషన్ల సాధన కోసం అన్ని రాష్ట్రాల్లోని బీసీలను ఏకం చేసి పోరాడుతామన్నారు.  బీసీ ప్రజాప్రతినిధులు కూడా రిజర్వేషన్ల సాధన పోరాటంలో భాగస్వామ్యం కావాలని.. లేకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని చెప్పారు.