లైట్‌గా తాగినా..  ఎడిక్షనే!

లైట్‌గా తాగినా..  ఎడిక్షనే!
రోజుకు ఒకటేగా.. తాగితే ఏమైతది?’ ‘వారానికి ఒకటి రెండు సార్లు తాగితే ఏం కాదులే!’ అని స్మోకర్స్ అనుకోవడం చూస్తనే ఉంటం. రోజుకు పది సిగరెట్లు తాగేవాళ్లనే నికొటిన్ ఎడిక్టెడ్‌ అనేటోళ్లు. కానీ, ఇప్పుడు అట్ల కాదు.. లైట్‌ స్మోకర్స్‌ కూడా నికోటిన్‌కి ఎడిక్ట్ అయితున్నట్టు రీసెంట్‌గా అమెరికాలోని ‘పెన్‌ స్టేట్‌ కాలేజీ ఆఫ్‌ మెడిసిన్‌ అండ్‌ డ్యూక్ యూనివర్సిటీ ’ సైంటిస్టులు చేసిన  స్టడీలో తేలింది. ‘‘మా స్టడీలో వచ్చిన ఫలితాలను బట్టి చూస్తే  అప్పుడప్పుడు తాగే లైట్ స్మోకర్స్‌ కూడా సిగరెట్లకు ఎడిక్ట్ అయ్యే ప్రమాదం ఎక్కువ అని తేలింది. ఈ ఎడిక్షన్‌ని ‘టొబాకో యూజ్ డిజార్డర్‌‌’ అని పిలుస్తార’ని ఈ స్టడీని లీడ్ చేసిన ప్రొఫెసర్‌‌ జోనాథన్ ఫౌల్డ్స్‌ చెప్పిండు. మొత్తం 6,700 మందిపై  ఈ స్టడీ చేసిన్రు. ఇందులో ముందుగా తక్కువ సిగరెట్లు తాగేవాళ్లు కూడా నెమ్మదిగా నికోటిన్‌కి ఎడిక్ట్ కావడం మొదలు పెట్టిన్రు. మైల్డ్‌ లెవల్ నుంచి సివియర్ ఎడిక్షన్ లెవల్‌కి పోవడానికి వీళ్లకు ఎక్కువ టైం పట్టలేదు. రోజుకు ఒకటి నుంచి నాలుగు తాగేవాళ్లు, వారానికి ఒకటి రెండు సార్లు తాగేవాళ్లు కూడా తర్వాత  సిగరెట్లు లేకుండా ఉండలేని స్థితికి పోయిన్రని  ఫౌల్డ్స్‌ చెప్పిండు.  కాబట్టి, లైట్ స్మోకర్స్‌ అయినా సరే.. ట్రీట్‌మెంట్‌ తీసుకోవాల్సిందే  అని సైంటిస్టులు సలహా ఇస్తున్నారు. For More News.. లక్నవరంలో అడ్వెంచర్​ గేమ్స్​.. హీరోగా జానీ మాస్టర్ ఎంట్రీ హీరో రాం చరణ్‌కు కరోనా పాజిటివ్