
ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని కళ్లకు కట్టినట్లు ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శికే భద్రత లేదని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్న ఆయన.. మహిళా ఐఏఎస్ కే రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా తెలంగాణ మోడల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డయల్100 అని స్మితా సబర్వాల్ అంటుంటే.. కేసీఆర్ 100 పేపర్ బ్రాందీ అంటున్నారని సంచలన కామెంట్స్ చేశారు.
తన ఇంట్లోకి ఓ వ్యక్తి చొరబడ్డారని స్వయానా స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు. ఎంతో చాకచక్యంగా తన ప్రాణాలు కాపాడుకున్నాని చెప్పారు. అందరూ రాత్రిపూట అప్రమత్తంగా ఉండాలని సూచించారు.నిన్న రాత్రి స్మితా సబర్వాల్ ఇంట్లోకి చొరబడ్డ మేడ్చల్ జిల్లాకు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.