ప్రమాదమని తెలిసినా… డివైడర్లు దాటుతున్నారు

ప్రమాదమని తెలిసినా… డివైడర్లు దాటుతున్నారు

కేపీహెచ్​బీకాలనీ బస్టాప్​వద్ద పాదాచారులు రోడ్డు దాటేందుకు నానా అవస్థలు పడుతున్నారు. అక్కడ ట్రాఫిక్​సిగ్నల్​ పనిచేయకపోవడంతో ట్రాఫిక్​ పోలీసులు రోడ్డు దాటకుండా డివైడర్​ మధ్యలో ఉన్న ఖాళీ స్థలాన్ని భారీకేడ్లు పెట్టి మూసివేశారు. పక్కనే ఉన్న ఫుట్ ​ఓవర్​బ్రిడ్జిని ఉపయోగించుకోవాలని అక్కడ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. కానీ బస్టాప్​నుంచి ఫుట్ఓవర్​బ్రిడ్జి 200 మీటర్ల దూరంలో ఉండడంతో అంత దూరం వెళ్లలేక మూసి ఉన్న దారి గుండానే ప్రమాదకరంగా డివైడర్​ఎక్కి రోడ్డు దాటుతున్నారు. బస్టాప్​పక్కనే ఉన్న మెట్రో స్టేషన్​ మెట్ల గుండా కూడా వెళ్లవచ్చని తెలిసిన కూడా  ప్రజలు ఎవరూ అలా వెళ్లకుండా  ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నారు. సిగ్నల్​ లేకపోవడంతో వాహనదారులు వేగంగా వస్తుంటారు. ఇదే సమయంలో ప్రజలు డివైడర్​ఎక్కి అకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో వాహనదారులు వాహనాలను అదుపుచేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు.

పత్తాలేని ట్రాఫిక్​ పోలీసులు…

బస్టాప్​ వద్ద పాదాచారులు ఎవరూ రోడ్డు దాటకుండా డివైడర్​ మధ్యలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. కానీ ప్రజలు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ప్రమాదకరంగా రోడ్డును దాటుతున్నారు. ఇక్కడ విధులు నిర్వహించాల్సిన ట్రాఫిక్​ సిబ్బంది మాత్రం ఎక్కడ కనబడడం లేదు. దీంతో పాదాచారులకు అవగాహన కల్పించేందుకు, రోడ్డును అడ్డదిడ్డంగా దాటకుండా ఫుట్​ఓవర్​ బ్రిడ్జి ఉపయోగించుకునేలా సూచనలు చేసేందుకు ట్రాఫిక్​ పోలీసులు ఎవరూ అక్కడ కనిపించడం లేదు. కొందరూ మహిళలు చంటి పిల్లలను ఎత్తుకొని ప్రమాదకరంగా రోడ్డు క్రాస్​ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ట్రాఫిక్​ పోలీసులు స్పందించి ఎవ్వరు కూడా ప్రమాదకరంగా రోడ్డు దాటకుండా పక్కనే ఉన్న ఫుట్​ ఒవర్​ బ్రిడ్జిని ఉపయోగించునేలా చర్యలు తీసుకోవాలి.

సలహాలు ఇచ్చేందుకు ట్రాఫిక్​సిబ్బంది లేరు..

సిగ్నల్ పనిచేయడం లేదని పాదాచారులు రోడ్డు దాటకుండా రోడ్డు మధ్యలో ఉన్న ఖాళీ స్థలాన్ని క్లోజ్​ చేశామని ట్రాఫిక్​ పోలీసులు సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ఫుట్ ఓవర్​ బ్రిడ్జిని ఉపయోగించుకోవాలని తెలిపారు. అయితే వృద్ధులు, నడవలేని వారు, చంటి పిల్లలతో ఉన్న మహిళలు అంత దూరం వెళ్లలేక  డివైడర్​ఎక్కి రోడ్డు క్రాస్​ చేస్తున్నారు. ట్రాఫిక్​ సిగ్నల్ ఎప్పుడు పునరుద్ధరించి ఓపెన్​ చేస్తారని ట్రాఫిక్​ పోలీసులకు ఫోన్​ చేయగా తెలియదని అంటున్నారు. కనీసం బస్టాప్​ వద్ద సూచనలు సలహాలు ఇచ్చేందుకు  ట్రాఫిక్​ సిబ్బంది కూడా లేరు.