
పెళ్లి అంటే సాధారణంగా మేకప్ వేసుకోని వారుండరు. ఇక పెండ్లికుమార్తె ( వధువు) అందంగా కనిపించేందుకు ఆర్టిస్ట్ లతో అందంగా తయారు చేస్తారు. అయితే ఇప్పుడు ఓకుక్క వధువుగా ఫోజ్ పెట్టింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఫేస్ కు అందంగా మేకప్ వేసుకొని , పాపిడి బిళ్ల, పూలు పెట్టుకొని అతిథులను ఎంతగానో ఆకర్షించింది.
వైరల్ వీడియో గురించి ..
పెంపుడు కుక్కకు పెళ్లి మేకోవర్ ఇచ్చిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయింది. షార్మిలీ దుల్హన్ ( సిగ్గుపడే వధువు) లాగా పోజులిచ్చిన ఈ డాగ్ పెళ్లి చూపుల్లో ఉంది. ఈ వీడియోలో పెళ్లికూతురులా దుస్తులు ధరించిన కుక్కను చూడవచ్చు. ఆభరణాలు ధరించి.. గ్రాండ్ నెక్‌పీస్ .. నుదిటిపై పాపిడి బిళ్ల ... ఈ కుక్క సిగ్గుపడుతూ చాలా అందంగా కనిపించింది. ఈ వీడియో తొమ్మిది మిలియన్ల కంటే ఎక్కువ మందిని ఆకర్షించింది . జంతు ప్రేమికులు అయ్యో, చాలా అందమైనది అంటూ ... హమారీ గుడియా కి షాదీ. . అని ఇన్‌స్టాగ్రామ్‌లో క్యాప్షన్ ఇచ్చారు.
నెటిజన్ల స్పందన
నెటిజన్ల నుంచి ఈ వీడియోకు మిశ్రమ స్పందన వచ్చింది. పెళ్లికూతురిలా కనిపించే ఈ కుక్క ముఖం ఎంతో అందంగా ఉండటాన్ని సోషల్ మీడియాలో గమనించారు. జంతువును అసాధారణ రీతిలో అలంకరించడం .. హింస కంటే తక్కువ కాదని కొందరు పోస్ట్ చేస్తే , మరికొందరు ఈ కుక్క పూజించదగిన రూపంలో ఉందని ప్రశంసించారు.