ప్రతి పింఛన్ లబ్దిదారుడు ఒక మొక్క నాటాలి : హరీష్ రావు

ప్రతి పింఛన్ లబ్దిదారుడు ఒక మొక్క నాటాలి : హరీష్ రావు

ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి పెంచిన పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు టీఆర్ఎస్ కీలకనాయకుడు, మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేట నగరం… ప్రశాంత్ నగర్ లో సాంఘిక భద్రత పథకం కింద పెంచిన ఆసరా పెన్షన్లను పంపిణీ చేశారాయన. వృద్ధాప్య పింఛన్ ను రూ.వెయ్యి నుండి 2016కు.. వికలాంగుల పెషన్ రూ.,1500 నుండి రూ.3016కు పెంచి పేదల గుండెల్లో కేసీఆర్ ఒక ఆసరాగా నిలిచారని చెప్పారు.

“6 నెలల నుంచి ఎన్నికల కోడ్ వల్లే ఈ కార్యక్రమం ఆలస్యం అయింది. పెరిగిన పెన్షన్ … పేదల ఆత్మగౌరవం పెంచుతుంది. దేశంలోని 29 రాష్ట్రాలలో130 కోట్ల జనాభాలో రూ.2016 పెన్షన్ ఇస్తున్నది కేసీఆర్ మాత్రమే. త్వరలోనే నిజమైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తాం. పెన్షన్ దారులు ఒక్కొక్క మొక్కను నాటి వాటిని సంరక్షించాలి. చెట్లు కన్నతల్లి లాంటివి” అన్నారు హరీష్ రావు.