రక్తదానం చేసి పిల్లలను కాపాడండి

రక్తదానం చేసి పిల్లలను కాపాడండి

తలసిమియా వ్యాధి గ్రస్థుల కోసం ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని తలసిమియా సీకిల్ సొసైటీ సభ్యులు పిలుపునిచ్చారు. కరోనా వల్ల రక్తదానం చేసే వారు తక్కువ కావడంతో  రక్తం దొరకక తలసీమియా వ్యాధి గ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని…ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరారు. శివరాంపల్లి గ్రామం రాఘవేంద్ర కాలనీలో తలసిమియా సీకిల్ సొసైటీ ఉంది. ఇక్కడికి  ప్రతి రోజు  దాదాపు 40 మంది నిత్యం రక్తం కోసం ఇక్కడికి వస్తుంటారు. తలసీమియా వ్యాధి గ్రస్తులు ప్రతి 15 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఎక్కించుకోవాలని, జన్యుపరమైన లోపం ద్వారా ఈ తలసీమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సొసైటీ సభ్యులు తెలిపారు. తలసీమియా వ్యాధి గ్రస్తులు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించుకోలేని పరిస్థితిలో బాధితులు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. పలు రాష్ట్రాల నుండి శివరాంపల్లిలోని తలసేమియా సీకిల్ సొసైటీలో ఇక్కడికి వచ్చే ప్రజల కోసం నిత్యం ఉచితంగా రక్తం పంపిణీ చేస్తున్నామని, అటెండర్ లకు మధ్యాహ్న భోజనం కూడా పంపిణీ చేస్తున్నామని సభ్యులు తెలియజేశారు.