మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది ఫలితం..?

మధ్యాహ్నం 3 గంటల  తర్వాత తుది ఫలితం..?

హుజురాబాద్ బై పోల్ కౌంటింగ్ కు అంతా రెడీ అయింది. కాసేపట్లో  అంటే 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 22 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ కోసం రెండు హాల్స్ ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. ఆ తర్వాత అన్ని పార్టీల కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలు ఓపెన్ చేసి కౌంటింగ్ ప్రారంభిస్తారు. మొత్తం 306 ఈవీఎంలలో... ఒక్కో రౌండుకు 14 ఈవీఎంలు లెక్కిస్తారన్నారు. ఒక్కో రౌండ్ కౌంటింగ్ కు 20 నుంచి 30 నిమిషాల టైం పట్టే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 12 గంటల వరకు గెలుపుపై ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది. తుది ఫలితం మాత్రం 3 గంటల తర్వాతే వస్తుందని అంచనా. 

మొదటి రౌండ్ నుంచి ఆరో రౌండ్ వరకు హుజురాబాద్ మండల ఓట్లు లెక్కిస్తారు. ఈ మండలంలో 52 వేల 827 ఓట్లు పోలయ్యాయి. ఇక ఏడు నుంచి పదో రౌండ్ వరకు వీణవంక మండల ఓట్లు లెక్కించనున్నారు. ఈ మండలంలో 35 వేల 623 ఓట్లు నమోదయ్యాయి. పదకొండో రౌండ్ నుంచి 15వ రౌండ్ వరకు జమ్మికుంట మండల ఓట్లు కౌంట్ చేస్తారు. జమ్మికుంట మండలంలో మొత్తం 49 వేల378 ఓట్లు పోలయ్యాయి. 16 నుంచి 18 రౌండ్ వరకు ఇల్లందకుంట మండల ఓట్లు లెక్కిస్తారు. ఈ మండలంలో 22 వేల 501 ఓట్లు పడ్డాయి. చివరగా 19 నుంచి 22 రౌండ్ వరకు కమలాపూర్ మండల ఓట్లు లెక్కిస్తారు. కమలాపూర్ లో 44 వేల 907 ఓట్లు పోలయ్యాయి. 

కరీంనగర్ లోనే SRR ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ కొనసాగనుంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర మూడంచెల భద్రత పెట్టారు. కేంద్ర బలగాలను మోహరించారు. కౌంటింగ్ హాల్ గేటు లోపల బయట 650 పైగా పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 

మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది ఫలితం
ఉదయం 8 గంటలకు పోస్టల్​ బ్యాలెట్ల కౌంటింగ్​ మొదలు పెట్టి.. వీటిని అరగంటలో పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఒక్కో టేబుల్ లో ఉన్న ఈవీఎం లను ఏజెంట్ల సమక్షంలో ఓపెన్ చేసి కౌంట్​ చేస్తారు.  ఒక్కో రౌండ్  కౌంటింగ్​కు  20 నుంచి 30 నిమిషాల టైమ్ తీసుకునే అవకాశం ఉంటుంది. గెలుపు ఓటములపై  మధ్యాహ్నం 12 గంటల వరకు ఓ క్లారిటీ రానుంది. మధ్యాహ్నం 3 గంటల  తర్వాత తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది.  ప్రతి టేబుల్ కు ఇద్దరు సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిని పర్యవేక్షించేందుకు అధికారులను నియమించారు.  

పోస్టల్​ బ్యాలెట్​ ఓట్లు ‑ 753
మండలం     పోలైన ఓట్లు    రౌండ్​
హుజూరాబాద్​    52,827    1‑6
వీణవంక    35,623    7‑10
జమ్మికుంట    49,378    11‑15
ఇల్లందకుంట    22,501    16‑18
కమలాపూర్​    44,9‌‌07    19‑22
మొత్తం ఓట్లు    2,05,236