డబుల్ ట్విస్టులతో భామా కలాపం

డబుల్ ట్విస్టులతో భామా కలాపం

‘భామా కలాపం’ వెబ్‌‌ మూవీతో ఆకట్టుకున్న ప్రియమణి, ఇప్పుడు సీక్వెల్‌‌తో ప్రేక్షకుల ముందుకొస్తోంది. సీరత్ కపూర్, శరణ్య, రఘు ముఖర్జీ, బ్రహ్మాజీ ఇతర పాత్రలు పోషించారు. అభిమన్యు తడిమేటి దర్శకత్వంలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం ప్రెస్‌‌మీట్ నిర్వహించారు. ప్రియమణి మాట్లాడుతూ ‘థ్రిల్స్‌‌, ట్విస్టులతో సహా ‘భామా కలాపం 2’లో అన్నీ డబుల్‌‌ ఉంటాయి. మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనేది చూపించారు. ఈసారి కాస్త డేంజరస్‌‌గానూ ఉంటుంది’ అని చెప్పారు. ప్రియమణితో కలిసి నటించడం సంతోషంగా ఉందని, జుబేదా పాత్రలో కనిపిస్తానని సీరత్ కపూర్ చెప్పింది. ‘శిల్ప, అనుపమ పాత్రలను విడదీయకుండా కంటిన్యూ చేస్తున్న అభిమన్యుకు థాంక్స్’ అంది శరణ్య. ‘ఇందులో చాలా ట్విస్టులుంటాయి. మొదటి పార్ట్ చూసి రెండో పార్ట్ చూస్తే బాగుంటుంది’ అని దర్శకుడు అన్నాడు. ‘ఆహా’ బిజినెస్ హెడ్ వాసు, ఎడిటర్ విప్లవ్, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.