హైదరాబాద్ లోని కౌంటింగ్ సెంటర్లు ఇవే.. అక్కడ 144 సెక్షన్

 హైదరాబాద్ లోని కౌంటింగ్ సెంటర్లు ఇవే.. అక్కడ 144 సెక్షన్

తెలంగాణలో ఎన్నికల (Telangana Elections 2023) పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరిచారు. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. దీని కోసం జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో పలు విద్యా సంస్థలు, కార్యాలయాల్లో లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేస్తున్నారు. 

పోలీసులు స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడం లేదు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు ఆయా గదుల వద్ద ఆంక్షలు విధించారు. 144 సెక్షన్‌ అమల్లో ఉంది. గుంపులుగా తిరిగితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.  

హైదరాబాద్‌ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, గోదాముల్లో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 

కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్, సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను డిసెంబర్ 3న ఏర్పాటు చేయనున్నారు.

హైదరాబాద్‌లోని కౌంటింగ్ కేంద్రాలు ఇవే..

* ఏవీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్, వాణిజ్యం, దోమల్‌గూడ

*  ఇండోర్ స్టేడియం, అంబర్‌పేట్

*  R.B. వెంకట్రామా రెడ్డి మహిళా కళాశాల, 3-4-527, లింగంపల్లి, నారాయణగూడ

* కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, యూసుఫ్‌గూడ

*  కాలేజ్ ఆఫ్ కామర్స్, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ

*  జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ

* ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, మాసబ్ ట్యాంక్

* ESRA హాల్, తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయం, కోఠి

*  కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్, 1వ అంతస్తు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్, ముక్కరం జాహీ రోడ్, అబిడ్స్

*   నిజాం కాలేజ్ బషీర్‌బాగ్

*  సరోజినీ నాయుడు వనితా మహా విద్యాలయం, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి

*  అరోరాస్ లీగల్ సైన్సెస్ అకాడమీ, బండ్లగూడ

*  ప్రొఫెసర్ జి. రాంరెడ్డి దూరవిద్య అధ్యయన కేంద్రం, ఉస్మానియా యూనివర్శిటీ

*  ఆడిటోరియం హాల్-I, గ్రౌండ్ ఫ్లోర్‌లో, CSI ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వెస్లీ కాలేజీ గ్రౌండ్, ఆనంద్ థియేటర్ ఎదురుగా, సికింద్రాబాద్