
నిజామాబాద్, వెలుగు: ప్రధాని మోదీ కల్పించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అగ్రవర్ణ పేదలకు వరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. విద్యా, ఉపాధి అవకాశాలు పొందుతున్నారన్నారు. శుక్రవారం నగరంలోని మాణిక్ భవన్ స్కూల్ విద్యార్థులకు ప్రధాని మోదీ పుట్టినరోజు పురస్కరించుకొని బీజేపీ నాయకుడు తెరల శ్రీధర్‌గుప్తా తరఫున నోట్‌బుక్స్ పంపిణీ చేసి మాట్లాడారు.
బేటీ బచావో బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన, పోషణ్ మహా వంటి పథకాలు ఆడబిడ్డలకు లాభం చేకూరుస్తున్నాయని తెలిపారు. ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షుడు ధన్పాల్ శ్రీనివాస్, ఇంగు శివప్రసాద్, ప్రభాకర్, నాగరాజ్ పాల్గొన్నారు.