ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది

ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది

ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రెండు రోజుల పాటు ఆయన పలు ప్రాంతాలను సందర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారుతుందన్నారు. భారీ వర్షాలు పడతాయని ముందస్తు సమాచారం ఉన్నా ముందస్తు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాయలసీమలో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారన్నారు. వర్షాలు వరదలకు ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయన్నారు. అధికారులు వచ్చి కూడా ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించలేకపోయారన్నారు. సమర్థతతో వ్యవహరిస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించ వచ్చన్నారు. ప్రకృతి వైపరిత్యాలు వచ్చినప్పుడు సమర్థతో పనిచేయాలన్నారు చంద్రబాబు. 

ఈ విషయమై జ్యూడిషీయల్ విచారణ వేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా రేణిగుంటలో గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.అన్నమయ్య, ఫించా ప్రాజెక్టుల్లో నాసిరకం పనులు చేశారని చంద్రబాబు ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు డబ్బులు ఇవ్వలేదన్నారు.  మానవ తప్పిదం వల్ల రాష్ట్రంలో అపార నష్టం చోటు చేసుకొందన్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. జ్యూడీషీయల్ విచారణ నిర్వహించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుభవరాహిత్యం, అహంకారం ప్రజలకు శాపమైందని చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం పెరిగిందన్నారు.