సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు.. సజ్జన్ కుమార్ నిర్దోషి.. ఢిల్లీ కోర్టు తీర్పు

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు.. సజ్జన్ కుమార్ నిర్దోషి.. ఢిల్లీ కోర్టు తీర్పు

న్యూఢిల్లీ: సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్​ను ఢిల్లీ కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల సందర్భంగా సుల్తాన్ పురి ఏరియాలో సుర్జీత్ సింగ్ అనే వ్యక్తి హత్యకు గురికాగా.. సజ్జన్ కుమార్ సహా మరికొందరిపై మర్డర్ కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన స్పెషల్ జడ్జి గీతాంజలి గోయెల్ బుధవారం తీర్పు వెలువరించారు.

‘బెనిఫిట్ ఆఫ్ డౌట్’ కింద సజ్జన్ కుమార్ సహా నిందితులు వేద ప్రకాశ్ పియల్, బ్రహ్మానంద్ గుప్తాను నిర్దోషులుగా ప్రకటించారు. కాగా, సజ్జన్ కుమార్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి మరో కేసులో ఆయన దోషిగా తేలారు.