
- పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్ సిందూర్‌ను స్టార్ట్ చేయలేదు
- మాజీ డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ అనిల్ కుమార్ భట్ వెల్లడి
న్యూఢిల్లీ: యుద్ధం చిట్టచివరి ప్రత్యామ్నాయం కావాలని, ముందు అన్ని రకాలుగా ప్రయత్నించి విఫలమయ్యాకే యుద్ధానికి ఆలోచనలు చేయాలని మాజీ డీజీఎంవో లెఫ్టినెంట్ జనరల్ అనిల్ కుమార్ భట్ తెలిపారు. ఇటీవల ఓ మీడియా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆపరేషన్ సిందూర్‌పై తన అభిప్రాయాలను వెల్లడించారు. నాలుగురోజుల్లోనే యుద్ధం ఆపేశారంటూ జరుగుతున్న ప్రచారంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పీవోకేను స్వాధీనం చేసుకునేందుకు ఆపరేషన్ సిందూర్‌ను మొదలు పెట్టలేదని గుర్తుచేశారు. యుద్ధం తీవ్రమైన అంశమని ఇక మరో మార్గంలేదన్నప్పుడే మొదలుపెట్టాలని సూచించారు.
భవిష్యత్ యుద్ధాల్లో డ్రోన్లు చాలా కీలకం
ఆపరేషన్ సిందూర్‌తో డ్రోన్ల ఇంపార్టెన్స్ తెలిసిందన్నారు. మన దేశానికి యుద్ధంలో ఎక్కువకాలం పనిచేసే డ్రోన్లు అవసరమవుతాయన్నారు. వార్‌లో ఒకేసారి ఉపయోగించే డ్రోన్లను ఎక్కువగా తయారు చేయాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ఇండియా మరింత ఎక్కువగా తన కెపాసిటీని పెంచుకోవాలని సూచించారు. సొంతంగా డ్రోన్లను తయారు చేసుకునేలా ఎదగాలన్నారు. భవిష్యత్తు యుద్ధాలు భూమి, నీరు, ఆకాశంలో మాత్రమే కాకుండా అంతరిక్షం, సైబర్ స్పేస్‌లోనూ జరిగే అవకాశం ఉందన్నారు.