బీజీపీ, బీఆర్ఎస్ లకు ఓటేయొద్దు.. ఆకునూరి మురళి

బీజీపీ, బీఆర్ఎస్ లకు ఓటేయొద్దు.. ఆకునూరి మురళి

అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశాయని.. ఆ పార్టీలకు ఓటెయొద్దని.. ఓటర్లు డబ్బులు తీసుకోకుండా కుల మతాలకు అతీతంగా ఓటు వేయాలని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అన్నారు. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ లో నిర్వహించిన చైతన్య బస్సుయాత్రలో ఆకునూరి మురళి  మాట్లాడుతూ... తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో అధ్వాన్న పాలన  సాగుతోందని.. ప్రజలకు న్యాయం చేయలేదని.. వాళ్ల కుటుంబసభ్యులకుమాత్రం పదవులు కట్టబెట్టాడని విమర్శించారు. సీఎం కేసీఆర్ చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. గజ్వేల్ నియోజకం అభివృద్ధి చెందలేదని.. 80 శాతం ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇంట్లు అందలేదని ఆరోపించారు. మేడిగడ్డ అన్నారు బ్యారేజీలు ఇంకా పూర్తికాలేదని.. అవి పూర్తి కావాలంటే 52వేల కోట్లు కావాలని అన్నారు. 

మరోవైపు బీజేపీని కూడా నమ్మే పరిస్థితి లేదని.. లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి.. ప్రభుత్వ ఉద్యోగాల కోటా తగ్గించారని విమర్శించారు. ప్రతి పేదవాడికి ఇళ్లు కట్టిస్తామని  చెప్పి మోదీ ప్రజలను మోసం చేశారని అన్నారు. మోదీ తన దోస్తులకు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని ఆకునూరి మురళి ఆరోపించారు. బీజేపీ, బీఆర్ ఎస్ రెండూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశాయని.. ఆ పార్టీలకు ఓటెయొద్దని ఆకునూరి మురళి కోరారు.