మాజీ లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెళ్లిలో మరొకరితో ప్రేమ.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

మాజీ లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెళ్లిలో మరొకరితో ప్రేమ.. ఆకట్టుకుంటున్న ట్రైలర్

జాన్వీ కపూర్,  వరుణ్​ ధావన్ జంటగా రూపొందిన చిత్రం ‘సన్నీ సంస్కారి కీ తులసి కుమారి’. సాన్యా మల్హోత్రా కీలకపాత్ర పోషించింది. శశాంక్ ఖైతన్ దర్శకుడు. సోమవారం (సెప్టెంబర్ 15) ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. సన్నీ (వరుణ్ ధవన్‌‌‌‌) అనన్యను ప్రేమిస్తాడు. ఆమెకు ‘బాహుబలి’ సినిమా ఇష్టమని ఆ గెటప్‌‌‌‌లో ప్రపోజ్  చేస్తాడు. కానీ ఆమె అతడిని రిజెక్ట్ చేసి విక్రమ్‌‌‌‌ (రోహిత్ షరాఫ్‌‌‌‌)తో పెళ్లికి రెడీ అవుతుంది.

 మరోవైపు ఆ పెళ్లికొడుకు కూడా తన  లవర్‌‌‌‌‌‌‌‌ తులసికి బ్రేకప్ చెప్తాడు. దీంతో సన్నీ, తులసి కలిసి ఆ పెళ్లిని చెడగొట్టడం కోసం తమ మాజీ లవర్స్‌‌‌‌ మ్యారేజ్‌‌‌‌లో సర్‌‌ప్రైజ్ ఎంట్రీ ఇస్తారు. పెళ్లిని చెడగొట్టేందుకు నానా హంగామా చేస్తారు. మాజీ లవర్స్‌‌‌‌ను రెచ్చగొట్టేందుకు వీళ్లిద్దరూ క్లోజ్‌‌‌‌గా ఉన్నట్టు నాటకమాడతారు.  ఈ క్రమంలో నిజంగానే తులసికి దగ్గరవుతాడు సన్నీ. ఈ ఎక్స్‌‌‌‌ లవర్స్‌‌‌‌ మ్యారేజ్‌‌‌‌లోని లవ్‌‌‌‌ డ్రామా ఆ తర్వాత ఎలాంటి టర్న్‌‌‌‌ తీసుకుందనేది మిగతా కథ. 

పెళ్లి నేపథ్యంలో హమ్టీ శర్మ కీ దుల్హానియా, బద్రీనాథ్ కీ దుల్హానీయా చిత్రాలతో ఆకట్టుకున్న శశాంక్ ఖైతన్‌‌‌‌ మరోసారి తనకు అచ్చొచ్చిన మ్యారేజ్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో ఈ రొమాంటిక్‌‌‌‌ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌ను తెరకెక్కించాడు. కరణ్‌‌‌‌ జోహార్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది.