మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత

మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కన్నుమూత

హైదరాబాద్ :  మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత ఫరీదుద్దీన్ గుండెపోటుతో కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందారు. 2004 ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆయన మైనార్టీ వెల్ఫేర్ మంత్రిగా పనిచేశారు. 2014లో టీఆర్ఎస్ లో చేరిన ఫరీదుద్దీన్ 2016లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.  ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా ప్రజలకు విశేష సేవలందించారు. ఫరీదుద్దీన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. మైనార్టీ నేతగా, ప్రజా ప్రతినిధిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఫరీదుద్దీన్ కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

For more news...

రెండోసారి కోవిడ్ బారిన పడ్డ అర్జున్ కపూర్

ముంబైలో భారీగా పెరిగిన కరోనా కేసులు