మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్న కొడుకు పొన్నాల భాస్కర్ అరెస్ట్ అయ్యారు. ఉద్యోగాల పేరుతో భారీ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. రైల్వేలో ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని కోటి రూపాయలు తీసుకుని మోసాలకు పాల్పడ్డారు. 16 మంది నిరుద్యోగుల వద్ద ఉద్యోగాలు వస్తాయని మాయమాటలు చెప్పి డబ్బులు వసూలు చేశారు. ఈ మేరకు జవహార్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది.
ఈ కేసు విచారణ చేపట్టిన పోలీసులు కీలక నిందితుడు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సమీప బంధువుగా గుర్తించారు. పొన్నాల అన్న కొడుకు పొన్నాల భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే లో టికెట్ కలెక్టర్, కమర్షియల్ క్లర్క్ జాబ్ ఇప్పిస్తామని అపాయింట్ మెంట్ లెటర్స్ ,ఐడి కార్డులను సైతం భాస్కర్.. ఇచ్చాడని పోలీసులు వెల్లడించారు. ఉద్యోగాలు వస్తాయని అప్పులు, తెచ్చి ఇంట్లో బంగారం అమ్ముకుని నిరుద్యోగులు..డబ్బులు ఇచ్చారన్నారు. అయితే ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో వాళ్లను ముంబై తీసుకెళ్లి అక్కడ భాస్కర్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి నిందితులను నుండి రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
నిందితుల నుండి నకిలీ రైల్వే ఐడి కార్డ్, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి:
