ఆ బిల్లు వాపసు వస్తుందని కేసీఆర్ నాతో అన్నారు

ఆ బిల్లు వాపసు వస్తుందని కేసీఆర్ నాతో అన్నారు

హైదరాబాద్, వెలుగు: ముస్లిం, గిరిజనుల రిజర్వేషన్లపై టీఆర్ఎస్, బీజేపీలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని మాజీ మంత్రి షబ్బీర్​ అలీ మండిపడ్డారు. బుధవారం గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు పెట్టినపుడే అది డ్రామా అని చెప్పానని, కేసీఆర్​ కూడా కేంద్రం నుంచి బిల్లు వాపస్​ వస్తుందని తనతో అన్నారని గుర్తు చేశారు. ఇది ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. రిజర్వేషన్లు ఎందుకు పెంచాలో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కారును వివరణ కోరుతూ మూడు సార్లు లేఖలు రాసిందని చెప్పారు. కానీ, టీఆర్​ఎస్​ సర్కార్ కూడా ఏ ఒక్క లేఖకు సమాధానం ఇవ్వలేదని అన్నారు. అంతేకాకుండా బీసీ కమిషన్​ ఇచ్చిన రిపోర్టుకు వ్యతిరేకంగా రిజర్వేషన్ల బిల్లు పంపారని అన్నారు. గిరిజనులకు 9.08 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రతిపాదించడం సమంజసంగా ఉండేదన్నారు.