బీఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ లో చేరిన విఠల్ రెడ్డి

 బీఆర్ఎస్ కు బిగ్ షాక్ ..  కాంగ్రెస్ లో చేరిన  విఠల్ రెడ్డి

పార్లమెంట్  ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి.  ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడారు. కొందరు బీజేపీలో చేరుతుండగా మరికొందరు కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నారు.దీంతో కారు పార్టీ ఖాళీ అవుతుంది అన్న కామెంట్లు  బలంగా వినిపిస్తున్నాయి. 

తాజాగా బీఆర్ఎస్ కు  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిపోయారు. 2024 మార్చి 21వ తేద గురువారం  సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో విఠల్ రెడ్డిని కాంగ్రెస్ లో చేరారు. ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారుమంత్రి సీతక్క.

ALSO READ :- అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నాం : మంత్రి సురేఖ

ముధోల్ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు విఠల్ రెడ్డి. 2014లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన విఠల్ రెడ్డి ఆ తరువాత బీఆర్ ఎస్‌ లోకి వెళ్లారు. 2018లో కూడా ఆ పార్టీ నుంచే పోటీ చేసి మ‌రోసారి విజ‌యం సాధించారు. అయితే 2023 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తాజాగా కాంగ్రెస్ లో చేరారు.  విఠల్ రెడ్డి తండ్రి గడ్డన్న ఈయన ముధోల్ నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.