అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నాం : మంత్రి సురేఖ

అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నాం : మంత్రి సురేఖ

అడవులను సంరక్షించుకునే దిశగా అడుగులు వేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. అడవులు తగ్గి పర్యావణంలో సమతుల్యత లోపించి విపత్తుల బారిన పడుతున్నామని చెప్పారు. ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మంత్రి స్పందించారు. తెలంగాణలో 24.05 శాతం ఉన్న అడవుల విస్తీర్ణాన్ని జాతీయ అటవీ విధానం ప్రకారం 33 శాతానికి పెంచే దిశగా కార్యాచరణను అమలు చేస్తున్నామని తెలిపారు. 

ప్రకృతి మాత్రమే శాశ్వతమైనదనే సత్యాన్ని గుర్తిస్తే బాగుంటుందని మంత్రి అన్నారు. మానవ మనుగడకు ఆధారంగా నిలుస్తున్న అడవులను జాగ్రత్తగా కాపాడుకునేలా ఉద్యమించాలని కోరారు. ప్రకృతిని సంరక్షిస్తూ, ప్రకృతితో మమేకమై జీవించడమే అర్థవంతమైన జీవితమని తెలిపారు.

ALSO READ :- బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరగాలే : సోనియా గాంధీ

 అడవులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉన్నదని చెప్పారు. ‘అడవులు, ఆవిష్కరణలు : మెరుగైన ప్రపంచం కోసం కొత్త పరిష్కారాలు’ థీమ్ తో ప్రపంచవ్యాప్తంగా అటవీ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామని మంత్రి సురేఖ తెలిపారు.