
కేంద్రం ఇచ్చే సొమ్ముతో కేసిఆర్ సోకులు చేసుకుంటున్నాడని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ లో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగిన బీజేపి వైపే ప్రజలు ఉన్నారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలన్న ఆయన కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి
కరీంనగర్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసే విషయంపై పార్టీ శ్రేణులు దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సూచించారు. బీజేపీ అనుబంధ విభాగాలను మరింత బలోపేతం చేయాలన్నారు. సంస్థాగతంగా ఉన్న లోపాలను చక్కదిద్దుకొని ముందుకు సాగాలని చెప్పారు.