మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూత

మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి  కన్నుమూత

శామీర్ పేట, వెలుగు: శామీర్ పేటకు చెందిన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు బుధవారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హాస్పిటల్ కు తరలించారు. హాస్పిటల్​లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 

ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా చేసిన రంగారెడ్డి.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. కిరణ్ కుమార్​రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత ఆయన కూడా అదే పార్టీలో చేరారు. మాగం మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం శామీర్ పేట అంతాయి పల్లిలో రంగారెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. రంగారెడ్డి మృతి పట్ల  వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు.