19న బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్ !

19న బీజేపీలోకి  బూర నర్సయ్య గౌడ్ !

టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఈ నెల 19న బీజేపీలో చేరనున్నారు. రేపు( సోమవారం) బూర నర్సయ్య గౌడ్ ఇంటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా పలువురు నేతలు వెళ్లనున్నారు. పార్టీలో చేరడంపై నర్సయ్యతో వారు చర్చించనున్నారు. బీజేపీ జాతీయ నేతల సమక్షంలో నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల‌ 28న హైదరాబాద్ లో బీసీ ఆత్మీయసభకు  బీజేపీ సిద్ధమవుతోంది.

తెలంగాణ ఉద్యమంలో బూర నర్సయ్య గౌడ్ క్రియాశీలక పాత్ర పోషించారు. 2013 సంవత్సరంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2019లో జరిగిన  లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు.