కాషాయ కండువా కప్పుకున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

కాషాయ కండువా కప్పుకున్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీలో చేరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. గత కొంతకాలంగా ఏ పార్టీలో చేరాలన్న దానిపై డైలామాలో ఉన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. దీనిపై పలు నియోజకవర్గాల్లో సర్వే కూడా నిర్వహించారు, అయితే చివరకు బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. గతంలో రేవంత్ రెడ్డితోనూ  ఆయన భేటీ అయ్యారు. 

కాగా 2013లో టీఆర్ఎస్ లో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. 2014 ఎన్నికల్లో చేవెళ్ళ నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. 2018 నవంబర్లో టీఆర్ఎస్ కు రాజీనామా చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. అయితే 2019ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత 2021 మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. ఇప్పుడు బీజేపీలో చేరారు.