కేసీఆర్ మెట్టు దిగి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి

కేసీఆర్ మెట్టు దిగి ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలి

రాజకీయాలు పక్కన పెట్టి సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో  చర్చలు జరపాలన్నారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.  విలీనం విషయంలో వెనక్కు తగ్గారు కాబట్టి  కార్మికులతో చర్చలు జరపాలన్నారు. కార్మికుల 26 డిమాండ్లలో చాలా సహజమైన డిమాండ్లు ఉన్నాయన్నారు. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ ప్రణాళిక ఏంటో అర్థం కావడం లేదన్నారు. 48 వేల మంది  కార్మికుల సమస్యలపై సైలెంట్ గా ఉండటం న్యాయం కాదన్నారు. రిటైర్డ్ జడ్జీలతో కమిటీ వేస్తామంటే ఎందుకు ఒప్పుకోలేదన్నారు.  చట్టవిరుద్ధమైన సమ్మె కాదని కోర్డు చెబితే మీరేమే సమ్మె చట్టవిరుద్ధమని అనడమేంటని ప్రశ్నించారు.