- పొంగులేటి, తుమ్మల వర్గాల ఆత్మీయ సమ్మేళనాలు
- న్యూఇయర్ సందర్భంగా ఖమ్మంలో అనుచరులకు విందు
ఖమ్మం: ఇన్నాళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో దక్కిన గౌరవమేంటని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో భవిష్యత్ లో దక్కబోయే గౌరవమేంటో కూడా ఆలోచించాలన్నారు. గత నాలుగున్నరేళ్లలో ఏం ఇబ్బంది జరిగిందో తెలియంది కాదన్నారు.
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో అనుచరులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన న్యూఇయర్ వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తన వెంట ఉన్న ముఖ్యనేతలంతా పోటీ చేసి తీరతారని తేల్చిచెప్పారు. ప్రజల అభిమానం పొందిన ప్రతినేత ప్రజాప్రతినిధి కావాలన్నారు. మున్ముందు కార్యకర్తలు కోరుకునేది తప్పకుండా చేసి చూపిస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
\