తెలుగు పార్టీలు ఎటు? రాజ్యాంగం ఉండాలా.. బీజేపీ ఉండాలా?

తెలుగు పార్టీలు ఎటు? రాజ్యాంగం ఉండాలా.. బీజేపీ ఉండాలా?

భారతదేశ చరిత్రలో ఇలాంటి ఎలక్షన్​  ఫస్ట్​ టైమ్ జరుగుతోంది. ఇది రొటీన్​గా జరుగుతున్న ఎలక్షన్​ కాదు. ధన్​ఖడ్​ ఎందుకు రాజీనామా చేశారో  స్పష్టంగా తెలియకుండానే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు. డెఫినెట్​గా మోదీతో డిఫర్​ అయ్యే ఆయన తప్పుకుని ఉంటారని అనుకోవాలి. ఎందుకంటే మోదీతో డిఫర్​ అవ్వకపోతే రాజీనామా చేయాల్సిన పనిలేదు.  ఒంట్లో బాగాలేకపోతే నాలుగు రోజులు ట్రీట్​మెంట్​తీసుకుంటారు. డిప్యూటీ చైర్మన్ సభ​ నడుపుతాడు. అసలు యాక్చువల్​గా  డిప్యూటీ చైర్మన్​లే సభను నడుపుతారు. చైర్మన్​  ప్లస్​ ఉప రాష్ట్రపతిగా ఒకరే ఉంటారు. 

వారు వచ్చి కూర్చొని కాసేపు ప్రభుత్వాన్ని కానిస్టిట్యూషనల్​ హెడ్​గా  నడిపి వెళ్లిపోయాక డిప్యూటీ చైర్మనే సభను నడుపుతుంటారు. ధన్​ఖడ్​ఎందుకో హఠాత్తుగా రాజీనామా చేశారు. ఇప్పటివరకూ ఆ సస్పెన్స్​ అలాగే ఉంది. అధికారిక ఇల్లు కూడా ఖాళీ చేసేశారని తెలిసింది. చాలా తీవ్రమైన మనోవేదనకు గురైన.. ధన్​ఖడ్​ కానిస్టిట్యూషన్ ఎక్స్​పర్ట్​ ఇన్​ లా.  అదికూడా మనం మర్చిపోకూడదు. ఆయన రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆ తరువాత  ఇప్పుడు వాళ్లు  డైరెక్టుగా ఆర్​ఎస్ఎస్​  బేస్​ ఉన్నటువంటి రాధాకృష్ణన్​ అనే ఆయనను పోటీకి నిలబెట్టారు. 


బీజేపీ వారు వాళ్లను వ్యతిరేకించినవారు ఎవరైనా సరే శిరశ్ఛేదనం చేస్తారు. బీజేపీవారికి ఇప్పుడున్న రాజ్యాంగం మీద కానీ, ఇప్పుడున్న నేషనల్​ ఫ్లాగ్​మీదగానీ, సెక్యులర్​ సెటప్​ అంటే..ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు అందరూ కలిసి ఉండాలనే సెక్యులర్​ సెటప్​పై ఏమాత్రం నమ్మకం లేదు.  వందేళ్లనుంచి అలాగే దాన్ని నడుపుకుంటూ వచ్చారు.  డిఫర్ అయ్యేది దాంతోనే​. వాళ్ల ఐడియాలజీకి తగ్గట్టుగానే వాళ్లు చేస్తారు. ఐడియాలజీలో ఏ పాయింట్లు అయితే వాళ్లు చెపుతున్నారో ఆ పాయింట్లతో కనుక డిఫర్​ అయ్యేటివాళ్లు ఓట్లు వేస్తే..  బ్రిటిష్ వాళ్లతోటి,  మహమ్మద్​ ఘోరీ, మహమ్మద్​ ఘజనీతోటి కలిసిపోయేవంటివాళ్లను ఏ రకంగా అయితే మనం ఇప్పటికీ కూడా చరిత్రలో ద్రోహులుగా చూస్తున్నామో, రేపు మిమ్మల్ని కూడా అలాగే చూస్తారు. 

తెలుగువాడికి తెలుగుదేశం ఓటేయాలి!

ఇయ్యాల ఇంత క్రూషియల్ ఎలక్షన్​లో  తెలుగు ప్రాంతం నుంచి సుదర్శన్​ రెడ్డి నిలబడ్డారు.  ఆయన ఏ పార్టీకి  చెందనివాడు, సోషలిస్టు భావాలు ఉన్నవాడు. సెక్యులర్​ భావాలు ఉన్నవాడు,  ఆయనతోటి  నాకు స్వల్ప పరిచయం ఉంది. ఈమధ్యకాలంలోనే రెండు, మూడు మీటింగ్​లలో కలిసి పాల్గొన్నాం.  అవగాహన ఉన్నటువంటి వ్యక్తి.  కానిస్టిట్యూషనల్​ ఎక్స్​పర్ట్.  ఆయన  సుప్రీంకోర్టు జడ్జిగా రిటైరయ్యారు.కానిస్టిట్యూషన్​ను ఫింగర్​ టిప్స్​మీద చెప్పగల సమర్థత ఉన్న వ్యక్తి.   ఇప్పుడు ఏపీలో  ఉన్న అందరు ఎంపీలు కూడా ఆయనకు ఓటు వేయడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు.  

అదేంటండి.. మేం కూటమిలో భాగస్వాములం కదా  అని టీడీపీ వాళ్లు అనుకోనక్కరలేదు. ఎందుకంటే ఆ పార్టీ పేరే తెలుగుదేశం పార్టీ. ఈ తెలుగు వాళ్ల కోసం,  వారి ప్రైడ్​ కోసం ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. ఎప్పుడైతే తెలుగు అభ్యర్థి సుదర్శన్​ రెడ్డి పోటీ చేస్తున్నాడో.. మాకు ఈ పార్టీ అదీ కాదండి. మాది తెలుగుదేశం పార్టీ సుదర్శన్​ రెడ్డికే ఓటు వేస్తాం అని చెప్పి డైరెక్టుగా వేయొచ్చు.  ఎందుకంటే సీక్రెట్ ఓటు. దీంట్లో విప్​లు ఉండవు. పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేశారనే విప్​ ఉండదు. అంతేకాదు ఎవరికి ఓటు వేశారో కూడా తెలియదు. బహుశా తెలుగుదేశం వాళ్లంతా మా పార్టీనే  తెలుగువారిది కదండీ అందుకే అలా ఓటేశాం అనొచ్చు. 

నాడు చంద్రబాబు బీజేపీని స్ట్రాంగ్​గా వ్యతిరేకించాడు​

చంద్రబాబు నాయుడు గతంలో  రెండు మూడుసార్లు బీజేపీవారితో చాలా స్ట్రాంగ్​గా డిఫర్​ అయ్యారు.  ఈ దేశంలో చంద్రబాబు నాయుడు విమర్శించినంత స్ట్రాంగ్​గా మోదీని, బీజేపీని విమర్శించిన మరో నాయకుడు లేడు.  మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి. బీజేపీని మసీదులు కూలగొట్టే పార్టీ అన్న వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు. ఇయ్యాల ఈ అవకాశం వచ్చింది. ఈ అవకాశం కూడా మీరు చేస్తున్నది. సేఫ్​గార్డ్​ ఇంట్రెస్ట్​ ఆఫ్​ కంట్రీ. 

జగన్​ మద్దతు తన వ్యతిరేకులకేనా!

జగన్​ మోహన్ రెడ్డి పార్టీ అయితే  ఎన్డీఏకు ఎలా ఓటు వేస్తుందో నాకు అర్థం అవడంలే.  మొన్న మద్దతు
 ప్రకటించినట్టు పేపర్లో చూశా.  2014లో, 2024లో  టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీచేసి ఓడిస్తే.. మీరు ఏ కారణంగా బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తాం అన్నారో నాకు అర్థం అవలే.  ఎందుకంటే మీకు కాంగ్రెస్ పార్టీ వాళ్లంటే ఇష్టం లేదు. కాంగ్రెస్​ మీపైన కేసులు పెట్టిందంటున్నారు. సుదర్శన్​ రెడ్డి కాంగ్రెస్​ పార్టీ వాడు కాదే. కానిస్టిట్యూషన్​ను నిలబెట్టడం కోసం ఒక ప్రయోగం చేస్తున్నారు. ఇటువంటి విషయాల్లో కూడా వైసీపీ ఎందుకు బీజేపీకి  సపోర్టు చేస్తానంటోంది?
తీర్పు ఇచ్చినవారు నక్సలైటా? 

హోం మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి.. కోర్టు తీర్పును 

వ్యతిరేకించి ఉద్దేశాలను జడ్జికి ఆపాదించడం కంటెంప్ట్.  ఒక హోం మంత్రి.. సల్వాజుడుంపై జస్టిస్​ సుదర్శన్​రెడ్డి ఇచ్చిన  తీర్పును విమర్శించవచ్చు కానీ,  తీర్పు ఈయన ఇచ్చాడు. ఈయన కూడా నక్సలైటే అని ఆరోపణ చేశాడంటే.. ఎక్కడికి పోతున్నాం మనం? తీర్పు ఇచ్చే కోర్టు.. కానిస్టిట్యూషన్​లో  ఏం ఉందో  దానిమీద తీర్పు ఇస్తుంది. నీకు ఆ తీర్పు తప్పు అనుకుంటే.. టూ థర్డ్ మెజార్టీతో రాజ్యాంగాన్ని మార్చేయొచ్చు.  సల్వాజుడుం 2003లోనిది. తర్వాత పదేళ్ల నుంచి మీరే (బీజేపీ) అధికారంలో ఉన్నారు. ఒకవేళ ఆయన తప్పు ఆలోచనతో ఆ తీర్పు ఇచ్చి ఉంటే వెంటనే రాజ్యాంగ సవరణ చేసి ఎవరికి కావాలంటే వాళ్లకు ఆయుధాలు ఇవ్వొచ్చని చెప్పండి.  మీరు ప్రైవేట్​ పార్టీని తీసుకువచ్చి ఆయుధాలిచ్చి వాళ్లలో వాళ్లకు గొడవలు పెట్టడమనేది రాజ్యాంగం ఒప్పుకోలేదు. అందుకే 
కొట్టేశారు.  ఇది అందరికీ తెలుసు.  

రాజ్యాంగపరంగా ఆయుధాలు పట్టుకుని తిరిగే హక్కు ఓన్లీ పోలీసులు, మిలటరీకి, పారా మిలటరీ దళాలకే ఉంటుంది. కాదని ఎవరైనా ఒక ఆయుధం తీసుకుంటే దానికి కారణం చెప్పాలి. ఎవరికైనా ఆయుధం అవసరమే అనుకుంటే ఒక ఆయుధం ఇస్తారు. ఆయుధం కూడా ఏమైనా టెన్షన్​ వస్తే వెంటనే తీసుకువెళ్లి  సరెండర్​ చేసేయాలి.  అలాంటిది.. మీరు ఒక బ్యాచ్​ తయారుచేసి ఆ బ్యాచ్​కు ఆయుధాలిచ్చి నక్సలైట్లను చంపేయడానికి ఆయుధాలు  ఇస్తున్నామన్నారు.  అది కుదరదు. అక్కడ ఉన్న గిరిజనులందరినీ నక్సలైట్లను ఎదుర్కోవడం కోసం స్పెషల్​ రిక్రూట్​మెంట్ చేసుకుని వాళ్లందరికీ ఆయుధాలిచ్చి ఉంటే  ఆ గొడవ వేరు. కానీ, ప్రైవేటు సైన్యం తయారుచేశారు. రేపు ఎవరికివారు ప్రైవేటు సైన్యం తయారుచేసుకుంటారు. 

టీడీపీ, వైసీపీ, బీఆర్​ఎస్​గోల్వాల్కర్​ను అంగీకరిస్తాయా!

మొత్తం అన్నింటిపై గ్రిప్​ తీసుకుందామనే ప్రయత్నంలో భాగంగానే ఇయ్యాల ​ధన్​ఖడ్​ చేత రాజీనామా చేయించారనే నేను అంటాను.  అందుకే ఆయన కూడా మాట్లాడటం లేదు.  లేకపోతే ఆరోగ్యం అనో  లేక ఇంకోటనో ఆయన వచ్చి  చెప్పాలి. ఏం మాట్లాడటం లేదు ఆయన.  వీళ్ల ఆదేశానుసారం ధన్​ఖడ్​ తప్పుకున్నారు. వీళ్లపై తిరగబడి,  నిలబడే శక్తి లేక కామ్​ అయిపోయాడు.   ఈ మార్పు తీవ్రమైన మార్పు. ఏమై ఉంటుందో ఆలోచించండి.  ఒక్క విషయం మర్చిపోకండి. ఆర్​ఎస్ఎస్​ అనేటి మాతృసంస్థకు  బైబిలు, భగవద్గీత,  ఖురాన్​ ఏమిటంటే  పాంచజన్యం అని..  తెలుగులో  బంచ్​ ఆఫ్​ థాట్స్అని గూరూజీ గోల్వాల్కర్​ ఏదైతే రాశారో అదే ఆదర్శం. 

వరుసగా దాన్ని అమలుచేసుకుంటూ వస్తున్నారు.  దాంట్లో ఆయన క్లియర్​గా రాశాడు ముస్లింలు,  క్రిస్టియన్లు ఈదేశంలో ఉండటానికి అర్హత లేదు.  అలాగే, సోషలిస్టులుగానీ.. కమ్యూనిస్ట్​ పార్టీవారుగానీ,  ఇందిరాగాంధీగానీ,  సోషలిస్ట్​ జయప్రకాశ్​ నారాయణ్​గానీ వీళ్లందరికీ కూడా ఈ దేశంలో ఉండే హక్కు  లేదు.  ఇది మన బేసిక్​ సనాతన ధర్మానికి వ్యతిరేకం అని ఆయన చెప్పిన మాటలతోటి.. టీడీపీవారుగానీ,  వైసీపీవారుగానీ, బీఆర్​ఎస్​ పార్టీవారుగానీ అంగీకరిస్తే ఈ ఎలక్షన్​లో బీజేపీకి ఓటు వేస్తారు కావచ్చు!

బ్రిటిషర్స్​లాగ, గజనీల వలె..

ఇప్పుడు బీజేపీవారు మా ఐడియాలజీ ఇదే అంటారు.  ఐడియాలజీ ఇదే అన్నప్పుడు మనం ఏం అనగలం? వాళ్లతో విభేదించి ఆర్గ్యుమెంట్సు చేయగలంగానీ.. ఈ దేశం నుంచి పంపించేస్తాం, ఉండటానికి వీల్లేదు, అసలు బతకనివ్వం అనడం తప్పు. అది సెక్యులర్​ పాలసీ కాదు. బీజేపీ వారు వారి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. ట్రిక్​ ప్లే చేస్తున్నారు. 

ఏరకంగా అయితే బ్రిటిష్​ వారు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారో.. ఏ రకంగా అయితే గజనీ,  ఘోరీ మహమ్మద్​ ఇక్కడ అక్కడ ఉన్న గొడవలను  ఆసరాగా తీసుకుని వచ్చారో ఆ రకంగా బీజేపీ  ఆక్రమణకు ప్రయత్నం చేస్తుందేమో అని నా అనుమానం.  చీచీ మీది అనుమానం. మేం అంతా వాళ్లకు సపోర్టు.. ఏం మాట్లాడుతున్నావు  నువ్వు అంటే అది వేరే విషయం. కాదు. ఇలాంటివి ఆపాలి అనుకుంటే ఇది  రైట్​  టైమ్. ప్లీజ్​ థింక్​ అబౌట్​ ఇట్. థింక్​ ఓవర్ ఇట్.  మీకు ఏది నచ్చితే అది చేయండి! సెలవు!


రాజ్యాంగ అతీత పాలనకు మొదటి మెట్టు కానుందా!

ఏదో వైస్​ ప్రెసిడెంటు..చిన్న ఎలక్షను అనుకోకండి.  వైస్​ప్రెసిడెంటు, ప్రెసిడెంట్​ ఎలక్షనుగానీ ఇలా భారతదేశంలో ఎప్పుడూ రాలేదు. ఇది.. రాజ్యాంగం ఉండాలా.. బీజేపీ ఉండాలా?.. బీజేపీ అనే పార్టీ రాజ్యాంగాన్ని  పక్కనపెట్టి ఈ దేశాన్ని పరిపాలించడానికి ఫస్ట్​ మెట్టు ఇది.  ఇప్పటిదాకా డెమోక్రటిక్​గా వచ్చారు.  ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంటును ఆల్మోస్ట్​ పారిపోయేలా చేసి  వైస్​ ప్రెసిడెంట్​ ఎలక్షన్​ తీసుకువచ్చారు.  తీసుకువచ్చింది కూడా వాళ్లకు పూర్తి మెజార్టీ ఉన్న టైమ్​లో తీసుకురాలే.  

వాళ్లు గ్యారంటీగా నెగ్గుతారన్న టైమ్​లో తీసుకురాలే.  మీరు కూడా నెగ్గని పరిస్థితిలో ఈ ఎలక్షన్​ తీసుకువచ్చారు. ఆలోచన చేయండి. బీజేపీ ఆలోచన కరెక్టు. ఆర్​ఎస్ఎస్​ ఆలోచన కరెక్టు. గురూజీ గోల్వాల్కర్​ చెప్పింది  కరెక్టు అని ఒప్పుకుంటే  ఓటు వేయండి.  నేను మిమ్మల్ని తప్పుబట్టలేను.  


నాడు మహారాష్ట్రకు చెందిన ప్రతిభాపాటిల్​కే ఓటేసిన శివసేన ఒక ఇన్సిడెంట్​ నాకు  గుర్తుంది. ప్రతిభాపాటిల్ పోటీ చేసినప్పుడు శివసేన పూర్తిగా కాంగ్రెస్​కు తీవ్రమైన వ్యతిరేకంలో ఉంది. ఎందుకంటే మేం అప్పుడు ఎంపీలం. అపోజిషన్ బెంచిలో ​ గట్టిగా మాట్లాడేవాళ్లు శివసేనలోనే ఉన్నారు. వాళ్లు కాంగ్రెస్​ క్యాండిడేట్​  ప్రతిభాపాటిల్, అదే యూపీఏ క్యాండిడేట్​ను పెడితే వాళ్లు ఓటు వేస్తామని డైరెక్టుగానే చెప్పారు. 

ఎందుకంటే .. మాది మహారాష్ట్ర, ఆవిడది మహారాష్ట్ర.. మా మహారాష్ట్ర ప్రైడ్​ కోసమే శివసేన వచ్చింది. అందుకని మేం ధైర్యంగా వేస్తున్నామన్నారు. ఇది రిమెంబరింగ్​ ఫ్యాక్ట్.  తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు ఏ మాత్రం మొహమాటం లేకుండా ఎవరితో ఏ తగువు లేకుండా సీక్రేట్​గా సుదర్శన్​రెడ్డికి  ఓటువేసి వచ్చేయవచ్చు. దీనివల్ల ఏ నష్టం ఉండదు.

ఉండవల్లి అరుణ్​కుమార్​,
మాజీ ఎంపీ