కేసీఆర్ నన్ను మోసం చేశాడు

V6 Velugu Posted on Jun 12, 2021

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఇచ్చిన మాట తప్పాడని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు.  రాజకీయంలో, పదవుల్లో తన కుటుంబం ఉండదని కేసీఆర్ అన్నాడని ఆయన గుర్తుచేశారు. వివేక్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.  ‘ప్రజాస్వామిక తెలంగాణ చేస్తా అన్నడు.. కానీ, ఇప్పుడు మొత్తం కుటుంబ పాలన చేసిండు. ఉద్యమ కారులను వాడుకొని కేసీఆర్ మోసం చేసిండు. ఉద్యమ కారుల గొంతు కోస్తున్నడు. నన్ను, కోదండ రాంను, ఈటల రాజేందర్‌ను మోసం చేశాడు. ఆలే నరేందర్, విజయశాంతి తెలంగాణ కోసం పోరాటం చేస్తుంటే.. వారిని వీలినం చేసుకొని వాడుకున్నాడు. విజయశాంతితో పాటు అప్పుడు ఎంపీలుగా ఉన్న మేం.. తెలంగాణ బిల్లు కోసం కొట్లాడినం. అప్పుడు కేసీఆర్ పార్లమెంటులో లేడు. ఆయన తర్వాతా కొడుకు కేటీఆర్ సీఎం కుర్చీలో ఉండాలని చూస్తున్నాడు. ఉద్యమ కారులు ఏకమై కేసీఆర్‌కు బుద్ది చెప్పాలి’ అని వివేక్ అన్నారు.

Tagged Bjp, TRS, vijayashanthi, Hyderabad, CM KCR, BJP leader Vivek Venkatswamy, Gun Park, Ale Narender

Latest Videos

Subscribe Now

More News