ఎన్నికల కోడ్ తో వాయిదా పడిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవే

ఎన్నికల కోడ్ తో వాయిదా పడిన ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవే

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 19 నుండి మొదలై జూన్ 1వరకు 7 విడతల్లో దేశవ్యాప్తంగా అసెంబ్లీ, ప్రలమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇప్పటికే విడుదల చేసింది ఈసీ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో పలు పరీక్షల షెడ్యూల్ పై ఈ ఎన్నికల ప్రభావం పడనుంది. జేఈఈ మెయిన్స్, యుపిఎస్సి ప్రిలిమ్స్, నీట్ పీజీ, కే సెట్, ఎమ్ హెచ్ టీ సెట్, టీఎస్ ఈఏపీసెట్, పాలీసెట్, సీఏ, వంటి పరీక్షల[పై ఎన్నికల ప్రభావం పడనుంది.

ఎన్నికల ప్రభావంతో ఈ కింద తెలిపిన పరీక్షా తేదీల్లో మార్పు ఉండనుంది:

జేఈఈ మెయిన్స్ 2024:

ఏప్రిల్ 4 నుండి 15వ తేదీ వరకు జరగాల్సిన ఈ పరీక్ష సెషన్ 2 ఇప్పుడు ఏప్రిల్ 4 నుండి 12వ తేదీ వరకు జరగనుంది.

 ఎమ్ హెచ్ టీ సెట్ ( పీసీఎమ్, పీసీబీ ):

ఏప్రిల్ 16 నుండి 30వరకు జరగాల్సిన పీసీఎమ్ పరీక్ష మే 2 నుండి 17వ తేదీ వరకు జరగనుంది. పీసీబీ పరీక్ష ఏప్రిల్ 22నుండి 30వ తేదీ వరకు జరగనుంది.

టీఎస్ ఈఏపీసెట్ :

2024 సంవత్సరానికి గాను టీఎస్ ఈఏపీసెట్ పరీక్ష ఏప్రిల్ 9, 10, 11, 12 తేదీల్లో ఉదయం 9గంటల నుండి 12వరకు, మధ్యాహ్నం 3గంటల నుండి 6గంటల వరకు రెండు సెషన్స్ లో జరగనుంది. 

టీఎస్ పాలీసెట్:

మే 17న జరగాల్సిన ఈ పరీక్ష మే 24న ఉదయం 11గంటల నుండి 11:30 వరకు జరగనుంది.

ఏపీ ఈఏపీసెట్:

కొత్తగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష మే 16, మరియు 22 తేదీల్లో జరగనుంది.

యుపిఎస్సి సివిల్ పరీక్ష:

మే 26న జరగాల్సిన ఈ పరీక్ష కొత్త షెడ్యూల్ ప్రకారం జూన్ 16న జరగనుంది.

ALSO READ :- అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్లో కేసీఆర్ మాట్లాడుతుండు : సీఎం రేవంత్ రెడ్ది

నీట్ పీజీ:

జూన్ 23న జరగాల్సిన ఈ పరీక్ష జులై 15వ తేదికి వాయిదా పడే అవకాశం ఉంది.

సీఏ పరీక్ష:

సీఏ గ్రూప్ 1 పరీక్ష మే 3, 5,9 తేదీల్లో జరగనుండగా, గ్రూప్ 2 మే 11, 15, 17వ తేదీల్లో జరగనుంది. 

సీయూఈటి:

మే 15, 31 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ పరకటించాల్సి ఉంది.

ఇదిలా ఉండగా జేఈఈ అడ్వాన్స్, నీట్ యుజి, కే సెట్ పరీక్షా తేదీల్లో ఎలాంటి మార్పు లేదు.