రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు పరిశీలన

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు పరిశీలన

సికింద్రాబాద్, వెలుగు :  తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సికింద్రాబాద్​పరేడ్ గ్రౌండ్ ముమ్మరంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. బుధవారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పరిశీలించారు. ఈ సందర్బంగా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు. వేడుకలకు రాష్ట్ర నలుమూలాల నుంచి ప్రజలు రానున్నారని చెప్పారు. ట్రాఫిక్​అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.  స్టేజ్​ఏర్పాటు, విద్యుత్, బారికేడ్లు, మంచి నీరు,  ఎల్ఈడీ  స్క్రీన్లు, మైక్ సిస్టమ్ తదితర సదుపాయాలను పరిశీలించారు. వారితో కాంగ్రెస్ నాయకులు రోహిన్​రెడ్డి, మోతె శోభన్​రెడ్డి ఉన్నారు.