ముందు బ్యాక్ లాగ్.. ఆ తర్వాతే రెగ్యులర్ ఎగ్జామ్స్

ముందు బ్యాక్ లాగ్.. ఆ తర్వాతే రెగ్యులర్ ఎగ్జామ్స్

హైదరాబాద్, వెలుగు:  కరోనా లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ర్టంలోని పాలిటెక్నిక్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు సాంకేతిక విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముందుగా బ్యాక్ లాగ్ ఎగ్జామ్స్ నిర్వహించిన తర్వాతే, రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఫైనలియర్ స్టూడెంట్స్ కు మేలు జరుగుతుందని అధికారులు యోచిస్తున్నారు. రాష్ర్టంలో 172 పాలిటెక్నిక్ కాలేజీలుండగా, వాటిలో సర్కారు కాలేజీలు 55 ఉన్నాయి. 22 వేల మంది ఫైనలియర్ స్టూడెంట్స్ కు ఆరు నెలల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కొనసాగుతోంది. ఈ నెల18తో  ట్రైనింగ్ పూర్తి కానుంది. లాక్ డౌన్ నేపథ్యంలో వారికి ఆన్ లైన్ లో వైవా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే చాలామంది ఫైనలియర్, ఓల్డ్  స్టూడెంట్స్ కు బ్యాక్ లాగ్స్ ఉన్నాయి. బ్యాక్ లాక్ ఎగ్జామ్స్ పెట్టకపోతే, వారంతా ఈసెట్ కు అర్హత కోల్పోయే అవకాశముంది. అందుకే ముందు బ్యాక్ లాగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జులై 1 నుంచి 18 వరకు వీటిని పెట్టనున్నట్టు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సెక్రెటరీ యూవీఎస్ ఎన్ మూర్తి తెలిపారు.

జులై 27 నుంచి రెగ్యులర్ ఎగ్జామ్స్..

ఏప్రిల్ లోనే పాలిటెక్నిక్ 2, 4 సెమిస్టర్ ఎగ్జామ్స్  పూర్తి కావాల్సి ఉన్నా లాక్ డౌన్  వల్ల వాయిదా పడ్డాయి. ప్రస్తుత సడలింపులు ఇస్తుండటంతో జులై 27 నుంచి రెగ్యులర్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పెట్టాలని నిర్ణయించారు.

కరోనా తగ్గినా గుండెకు ముప్పు