- 15 నుంచి ఎస్ఏ2 ఎగ్జామ్స్
- రీషెడ్యూల్ చేసిన ఎస్సీఈఆర్టీ
హైదరాబాద్, వెలుగు: ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకూ సమ్మెటివ్ అసెస్మెంట్–2(వార్షిక) పరీక్షలను పండుగల తర్వాతే నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు మరోసారి పరీక్షల షెడ్యూల్ను మార్చిం ది. ఈ నెల 8 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను 15 నుంచి మొదలుపెడ్తామని ఎస్సీఈఆర్టీ ప్రకటించింది. ఈ నెల 15 నుంచి 22 వరకూ కొనసాగుతాయని వెల్లడించింది.
23న పేరెంట్స్ మీటింగ్ పెట్టి, ఫలితాలు రిలీజ్ చేయాలని ఆదేశించింది. కాగా, ఈ నెల 15, 16,18,19 తేదీల్లో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ పరీక్షలు నిర్వహించనుండగా, ఈ నెల 15 నుంచి 22 వరకూ 9వ తరగతి వరకూ పరీక్షలు కొనసాగుతాయని అధికా రులు వెల్లడించారు. కాగా, ఈ నెల 9న ఉగాది, 11న రంజాన్ పండుగల నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ మార్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. దీంతో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకున్నది.