మీ ఇంట్లో చెత్త ఇస్తే.. పెట్రోల్ రేటు తగ్గిస్తారు.. హైదరాబాద్ లో ఎక్కడంటే..?

మీ ఇంట్లో చెత్త ఇస్తే..  పెట్రోల్ రేటు తగ్గిస్తారు.. హైదరాబాద్ లో ఎక్కడంటే..?

మీ ఇంట్లో పనికి రాని వస్తువులు, చెత్తను పడేస్తున్నారు. అయితే చెప్పేది జాగ్రత్తగా వినండి.. ఇప్పటి నుంచి ఇంట్లో ఏవైనా పనికి రాని వస్తువులు, ప్లాస్టిక్, మొబైల్, ల్యాప్ టాప్ లు, కేబుల్స్, పేపర్, కార్డ్ బోర్డ్, నెట్ వర్క్ పరికరాలు  ఇలా  పాడై పోయినవి ఉంటే పడేయకండి వాటిని భద్రపరచండి. వీటితో  పెట్రోల్ ను డిస్కౌంట్ లో పొందండి. అవును చెప్పేది నిజం.. ప్రముఖ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్  లిమిటెడ్ (ఐవోసీఎల్)  రీఫ్యూయల్ విత్ రీసైకిల్ పేరిట ఓ  సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

ALSOREAD :ఒక దర్శకుడు.. ఇద్దరు మెగా హీరోలు.. మరి సినిమా ఎప్పుడు?

ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో క్యూ ఆర్ కోడ్  ని స్కాన్ చేసి ఈ ప్రోగ్రాంలో జాయిన్ కావాలి.  జాయిన్ అయిన వారు ఏం చేయాలంటే తమ ఇంట్లో ఉండే చెత్తను  తీసుకెళ్లి పెట్రో బంకుల్లో తూకం వేయాలి. అపుడు   బరువుకు తగ్గట్లు  క్రెడిట్ పాయింట్లు పొందొచ్చు. 10 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను ఇస్తే అదనంగా బెనిఫిట్ ఉంటుంది. 

ఇలా చేయడం ద్వారా లాభం ఏంటంటే.. పెట్రోల్ పోసుకునేటప్పుడు ఈ పాయింట్లను రిడీమ్ చేసుకుని పెట్రోల్ ఖర్చు తగ్గించుకోవచ్చు.  అయితే హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన  ఐదు ఇండియన్ పెట్రోలో బంకుల్లో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ప్రస్తుతానికి  హైటెక్ సిటీ,  టీఎస్ఐఐసీ నాలెడ్జ్ సిటీ, జూబ్లీ హిల్స్ రోడ్ నంబ 36, మియాపూర్ సైబర్ ఫిల్లింగ్ స్టేషన్ , బేగంపేటలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లోనే ఈ అవకాశం ఉంది.  ఈ ఐదు  చోట్ల ఈ కార్యక్రమం విజయవంతం అయితే  భవిష్యత్తులో 34 వేల పెట్రోల్ బంకుల్లో అమలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు.

హైదరాబాద్ లోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో.. 

1.  హైటెక్ సిటీలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు

2. TSIIC, నాలెడ్జ్ సిటీ —  IKEA దగ్గర

3.  జూబ్లీ హిల్స్ - రోడ్ నెం.36

4. సైబర్ ఫిల్లింగ్ స్టేషన్, మియాపూర్ దగ్గర

5. బేగంపేట్, ప్రకాష్ నగర్, బేగంపేట్ రోడ్