ఎల్ బీ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ స్పాట్ లోనే మృతి

ఎల్ బీ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఐ స్పాట్ లోనే మృతి

ఎల్బీనగర్ లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన కారు బైక్ పై వెళుతున్న ఎక్సైజ్ సీఐ, ఎస్సైలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎక్సైజ్ సీఐ స్పాట్ లోనే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే చార్మినార్ ఎక్సైజ్  సీఐ సాదిక్ అలీ, నారాయణ గూడా ఎక్సైజ్ ఎస్ఐ కాజావల్లి మోహినుదిన్ ఎల్ బీ నగర్ లో ఓ ఫంక్షన్ ముగించుకుని పోలీస్ కోటర్స్ కు బైక్ పై వెళ్తున్నారు. ఈ క్రమంలోనే రాంగ్ రూట్ లో వచ్చిన ఓ కారు వారిని బలంగా ఢీ కొట్టింది. 

ఈ దుర్ఘటనలో  ఎక్సైజ్  సీఐ సాదిక్ అలీ స్పాట్ లోనే చనిపోయాడు. ఎక్సైజ్ ఎస్ఐ కాజావల్లి మోహినుదిన్ ను కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. దుర్ఘటనను గమనించిన స్థానికులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.