డ్రగ్స్ కేసు.. లైసెన్సులు రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ

డ్రగ్స్ కేసు.. లైసెన్సులు రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ

హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారంలో సంచలనం సృష్టించిన రాడిసన్ హోటల్ లైసెన్స్ రద్దు చేస్తూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పబ్తో పాటు లిక్కర్ లైసెన్సులు క్యాన్సిల్ చేసింది. రాడిసన్ హోటల్లో 24గంటల పాటు మద్యం సప్లైకి పర్మిషన్ ఉంది. రూ. 56 లక్షల బార్ ట్యాక్స్ చెల్లించి జనవరి 7న లిక్కర్ సప్లైకి రాడిసన్ హోటల్ కు లైసెన్స్ పొందింది. ప్రస్తుతం 2B  బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో దాన్ని నడుపుతోంది. తాజాగా పబ్లో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టింది.

మరోవైపు పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ కేసులో విచారణ కొనసాగుతోంది. పబ్ నుంచి 216 సిగరెట్ బడ్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటిని పరీక్షల కోసం ఎఫ్ఎస్ఎల్ కు పంపారు. మరోవైపు బ్రగ్స్ కేసులో నిందితులైన ఏ1 అనిల్ కుమార్, ఏ2 అభిషేక్ ఉప్పాలకు నాపంల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే కేసు విచారణలో భాగంగా నిందితులిద్దరినీ 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని బంజారాహిల్స్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. 

For more news..

జూబ్లీహిల్స్ లో స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్

బాసర ట్రిపుల్ ఐటీలో అన్ని సమస్యలే