కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు

కల్తీ కల్లు విక్రయిస్తే కఠిన చర్యలు
  • రేపు 104  గ్రామాలకు ఆబ్కారీ ఆఫీసర్ల టీం 
  • నార్కొటిక్ డీఎస్పీ సోమనాథం 

నిజామాబాద్, వెలుగు : కల్తీ కల్లు విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్​ కేసు నమోదు చేయాలని నార్కొటిక్​ రీజనల్​ డీఎస్పీ సోమనాథం సూచించారు.  సోమవారం కలెక్టరేట్​లో ఆబ్కారీ ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు.   కల్తీ కల్లుకు దూరంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.  ఉమ్మడి జిల్లాలో కల్లు కల్తీకి ప్రమాదకరమైన డ్రగ్స్ వాడడం వల్ల కొందరు బానిసలుగా మారుతున్నారన్నారు. 

ఈ నెల7న  ప్రతి మండలంలోని నాలుగు గ్రామాలు కలిపి జిల్లావ్యాప్తంగా 104 గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. స్టూడెంట్స్​, యూత్​ ర్యాలీ, వీడియోల ప్రదర్శన, వాల్​పోస్టర్లు అంటించాలన్నారు. డాక్టర్, ఎస్సై, పంచాయతీ సెక్రటరీ, పౌర సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయ సంఘాలను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. కల్తీ కల్లు, డ్రగ్స్ విక్రయిస్తే టోల్​ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం ఇవ్వాలన్నారు. అంతకు ముందు కల్తీ కల్లుకు వ్యతిరేకంగా గ్రామాల్లో అంటించే పోస్టర్లను కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతుతో కలిసి
 ఆవిష్కరించారు.